హీరోలు, యాక్టర్లు, కమెడియన్లు సడన్ గా దర్శకులుగా మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. స్టార్ కమెడియన్ గా ఎదగడానికి ముందు వెన్నెల కిషోర్ కూడా “వెన్నెల 1 1/2, జఫ్ఫా” సినిమాలతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్న విషయం తెలిసిందే. ఇక ఏ.వి.ఎస్, ఎమ్మెస్ నారాయణ వంటి సీనియర్ కామెడియన్స్ కూడా దర్శకులుగా లేదా రచయితలుగా తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నించినవారే. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి కూడా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
నటీనటులు ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి “భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు” అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యిందట. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి నటుడిగా ఉన్నప్పుడే విశ్లేషకులపై దారుణంగా విరుచుకుపడిన శ్రీనివాసరెడ్డి ఒక దర్శకుడిగా వారి విశ్లేషణలు ఎలా రిసీవ్ చేసుకొంటాడో చూడాలి.