Sudhakar: చిరంజీవితో నా స్నేహం అలా మొదలైంది.. సుధాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • June 19, 2023 / 05:27 PM IST

తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి నటుడు సుధాకర్ ను కొందరు ఉద్దేశపూర్వకంగా ఇండస్ట్రీలో అణచివేసే ప్రయత్నాలు చేశారు దీంతో ఆయనకు తమిళంలో అవకాశాలు రాకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు హీరోగా అవకాశాలు రాలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా స్థిరపడ్డారు. ఇలా కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుధాకర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించకపోవడంతో చనిపోయారంటూ ఈయన గురించి వార్తలు వస్తున్నాయి. దీంతో ఈయన స్వయంగా స్పందిస్తూ తాను బ్రతికే ఉన్నానని క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన అనంతరం ఒక ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన గురించి వచ్చిన వార్తలపై స్పందించి దయచేసి ఇంకొకసారి ఇలాంటి వార్తలను పుట్టించకండి అంటూ కోరుకున్నారు.

అలాగే తన సినీ కెరియర్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు చాలా సంతోషం వేస్తుందని తెలిపారు. హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన ప్రతి పాత్రను చాలా సంతోషంగా చేశానని తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలో తనకు చిరంజీవి ఎంతో మంచి మిత్రుడు అని తెలిపారు. తాము ఇద్దరం ఒకే గదిలో ఉండే వారిమని అలామా ఇద్దరి స్నేహం మొదలైందని తెలిపారు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉందని తెలిపారు.

ఇక చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమాలో తాను (Sudhakar) నటించాలని చిరంజీవి పట్టు పట్టడంతో కాదనలేక ఈ సినిమాలో నటించాను అంటూ ఈ సందర్భంగా సుధాకర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు కొద్ది రోజులలోనే తన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సుధాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus