‘ఉదయం మురళి’ / ‘హృదయం మురళి’ అనే ఓ సినిమా త్వరలో రాబోతోంది. తమిళ సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా చూడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే అందులో వారి అభిమాన నటులు చాలా మందే ఉంటారు. అయితే తెలుగు వారు ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం అయితే అది తమన్ మాత్రమే. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా తమన్ మరోసారి యాక్టింగ్ చేస్తున్నారు. అయితే ఇది కాకుండా మరో అంశం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ఈ సినిమా పేరు.
‘ఇదయం’/ ‘హృదయం’ అంటూ సుమారు 35 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది తెలిసే ఉంటుంది. మురళి, హీరా ప్రధాన పాత్రల్లో ఆ సినిమా రూపొందింది. దీన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అనేక ప్రేమ కథలకు ఈ సినిమా స్ఫూర్తి అని చెప్పొచ్చు. వన్ సైడెడ్ ప్రేమకథల విషయానికొస్తే ఈ సినిమా టెక్స్ట్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ అంశమే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కామన్ అని అంటున్నారు.
ఇటీవల చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. రెండు సినిమాల మధ్యలో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా హీరో పాత్ర చిత్రణ అని చెప్పారు. తన ప్రేమను వ్యక్తపరచడంలో కుర్రాడు ఇబ్బందిపడటమే ఆ కామన్ పాయింట్ అని చెప్పారు. అంటే హీరోయిన్‌కి ప్రేమను వ్యక్తపరచలేక మనోవేదన పడే విధానం ఈ సినిమాలో కీలకం అని చెప్పింది టీమ్. ఇలాంటి కథలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుండి ఆదరణ దొరుకుతూనే ఉంటుంది. మరిప్పుడు ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
ఇక ‘హృదయం మురళి’ విషయానికొస్తే.. అథర్వ, కయాదు లోహర్, ప్రీతి ముకుందన్, తమన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. ఆకాశ్ భాస్కరన్ రూపొందించిన ఈ సినిమా జులై 10న విడుదలవుతుంది.