Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

గతేడాది ‘ది రాజా సాబ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిధి అగర్వాల్‌. ఆ ముందు ‘హరి హర వీర మల్లు’ సినిమాతో వచ్చింది. ఈ రెండు సినిమాలకు హీరోలు చేసిన ప్రచారం కంటే.. ఆమె ప్రచారమే ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఆ రెండు సినిమాల ఫలితాలు ఇబ్బంది పెట్టడంతో.. ఇప్పుడు తెలుగులో ఆమెకు సినిమాలు లేకుండా పోయాయి. ఈ కారణమో లేక ఇంకే కారణమో కానీ.. ఇటీవల ఆమె నోట పెళ్లి మాట వినిపించింది.

Nidhhi Agerwal

ఇటీవల ఓ షాప్‌ ఓపెనింగ్‌కి తిరుపతి వెళ్లిన నిధి అగర్వాల్‌.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ తిరుపతికి వస్తానని చెప్పి షాక్‌ ఇచ్చింది. హీరోయిన్‌గా విజయాలు లేకపోయినా.. కమర్షియల్‌ హీరోయిన్‌కి కావాల్సిన హంగులన్నీ ఉన్న నిధి.. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడింది అనే చర్చ మొదలైంది. ఆ ఒక్క మాటనే అలా అనేసుకుంటున్నారా అనే డౌట్‌ వద్దు. ఎందుకంటే ఆమె పెళ్లి చర్చ పెద్దగానే సాగింది.

నచ్చిన వరుడు దొరకలేదని, కుటుంబ సభ్యులు ప్రస్తుతం మంచి సంబంధం కోసం వెతుకుతున్నారని చెప్పింది. అయితే దక్షిణాది అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని మరో షాకిచ్చింది. పెళ్లి కొడుకు కోసం వెతుకులాట సాగుతున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేదని చెప్పింది. దీంతో నిధికి ఇప్పుడు పెళ్లి మీద ఎందుకు మనసైంది అనేది ఇప్పుడు టాపిక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ సోషల్‌ మీడియా. దీనికి సమాధానం ఆమెనే చెప్పాలి.

అన్నట్లు.. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లు నిధి చెప్పింది. అయితే ఆ సినిమాలేంటో ఇప్పటివరకు ఎక్కడా సమాచారం లేకపోవడం గమనార్హం. అలాగే రెండు తెలుగు సినిమాలకు సైన్ చేశానని, ఆగస్టు నుండి ఒకటి, అక్టోబర్‌లో ఒకటి ప్రారంభమవుతాయని చెప్పింది. ఆగస్టు 17న పుట్టినరోజు సందర్భంగా ఆ అనౌన్స్‌మెంట్‌లు ఇస్తారని చెప్పింది.

ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus