సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ చాలా ఫ్లాట్ గా ఉందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ రజినీకాంత్ స్వాగ్, నాగార్జున స్టైలిష్ విలనిజం, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్, అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి స్పెషల్ అట్రాక్షన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా ‘కూలీ’ కి సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు, మూడో రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 11.2 cr |
సీడెడ్ | 4.92 cr |
ఉత్తరాంధ్ర | 4.17 cr |
ఈస్ట్ | 2.21 cr |
వెస్ట్ | 1.82 cr |
గుంటూరు | 2.22 cr |
కృష్ణా | 2.01 cr |
నెల్లూరు | 1.02 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 29.57 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 1.78 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 2.35 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 33.7(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.33.7 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.60.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 13.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.