వరుస అపజయాలతో సతమవుతున్న డైరక్టర్ తేజ “నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రేమ కథలతో మ్యాజిక్ చేసే ఈ డైరక్టర్ ఈ చిత్రంలో ప్రేమకు కొంచెం పాలిటిక్స్ జోడించి హిట్ కొట్టారు. సినిమాని బాగా తీశారని తేజ ఓ వైపు అభినందనలు అందుకుంటుంటే.. మరోవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. “నేనే రాజు నేనే మంత్రి” కథ తేజ రాయలేదని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కథను తిమ్మా రెడ్డి అనే ఒక రచయిత రాసారని, ఈ కథ స్క్రిప్ట్ రూపంలో మారే వరకు తేజతో అతను ట్రావెల్ అయినట్లు సమాచారం.
సినిమా మొదలవ్వగానే తిమ్మా రెడ్డి ని తేజ పక్కన పెట్టడం మొదలు పెట్టారని, టైటిల్ కార్డు వేస్తామని చెప్పినప్పటికీ, ఆ మాటను తేజ తప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిమ్మా రెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ విషయంపై పోరాడేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.