చిరంజీవికి కూడా తప్పని కాపీ ఆరోపణలు…!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం రోపొందుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ 5నెలల పాటు వాయిదా పడింది. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజున ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో చిరుని చూస్తే రాంచరణ్ ఏమో అనేంత యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే కొంతమంది మాత్రం ‘ఆచార్య’ పోస్టర్ కాపీ అంటున్నారు. కన్నెగంటి అనిల్ కృష్ణ రచించిన ‘పుణ్యభూమి’ అనే నవల ఆధారంగా ఈ పోస్టర్ ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినా… కొంతమంది ఇలా కాపీ ఆరోపణలు చేస్తున్న సంగతి మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ఈ చిత్రంలో చిరు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus