టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సలార్ మరోవైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న ప్రభాస్ ను కరోనా టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెట్లో పొరపాటున కరోనా విజృంభిస్తే ఆ ప్రభావం షూటింగ్ పై పడుతుంది.
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటుండగా సెట్లో ఉన్న సమయంలో షూటింగ్ లో అతి తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉండే విధంగా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. కేవలం 25 మంది సిబ్బంది మాత్రమే ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సీజీ షాట్స్ తో ఉన్న సన్నివేశాలను దర్శకుడు ఓం రౌత్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
2022 సంవత్సరం ఆగష్టు 11వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వీ.ఎఫ్.ఎక్స్ కోసమే నిర్మాతలు 250 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. సినిమా అనుకున్న సమయానికి పూర్తికాని పక్షంలో నిర్మాతలపై అదనపు భారం పడే అవకాశం ఉండటంతో ఆదిపురుష్ దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సెట్ లో ఒక్కరికి కరోనా సోకినా మిగిలిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్ లో ఉండాలనే సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. చిత్రయూనిట్ లో ఎవరికి కరోనా సోకినా ఆ ప్రభావం షూటింగ్ పై పడుతుందని ప్రభాస్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.