ఆ గ్లామర్ క్వీన్స్ కు షాకిచ్చిన కోర్టు.. కారణం అదే..!

ఒకప్పుడు తమ గ్లామర్ తోనూ అలాగే నటనతోనూ టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన ముద్దు గుమ్మాలు రాశి.. రంభ. పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ భామలకు తాజాగా…. హై కోర్టు షాకిచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్నందుకు కాదండోయ్.! వీరిద్దరూ నటించిన ఓ వాణిజ్య ప్రకటన కారణంగా..! విషయం ఏంటంటే ‘కలర్స్’ అనే సంస్థకు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో వీరు చెప్పిన మాటలను నమ్మి మోసపోయినట్లుగా ఓ వినియోగదారుడు విజయవాడ వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ కేసును విచారించిన జడ్జ్ .. ‘కలర్స్’ సంస్థ ఆ ప్రకటనను వెంటనే నిలిపివేయాలని స్టే ఇచ్చింది. అంతేకాదు కొంత ఫైన్ కూడా విధించారు. ‘కలర్స్’ యాడ్ ను ఎవరూ ప్రసారం చేయకూడదని.. వాటిని వెంటనే నిలిపివేయాలంటూ ఆర్డర్ వేసింది. ఇక పిటిషన్ వేసిన వినియోగదారుడు చెల్లించిన రూ.74652 తో పాటు.. తొమ్మిది శాతం వడ్డీని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొంది. ఇక రాశి.. రంభ లు కూడా ఇటువంటి ప్రకటనలు చేయొద్దని…. ఇలాంటి ప్రకటనల్లో నటించటం ద్వారా తప్పుడు ప్రొడక్ట్స్ ను ప్రోత్సహించడమే అని… ఇక మీద ఇలాంటి యాడ్స్ నటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే సెలబ్రిటీలని కూడా చూడకుండా ఫైన్ వేస్తామని హెచ్చరించింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus