చైతూకి సామ్ ‘థాంక్స్’ చెబుతుందా.. లేదా?

  • July 2, 2020 / 08:00 AM IST

నాగ చైతన్య- సమంత ల కాంబినేషన్ కు ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. వీళ్ళు విడిగా సినిమాలు చేస్తే ఎలా ఉన్నాకానీ.. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. నిజానికి చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతోనే సమంత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వీరు కలిసి నటించిన ‘మనం’ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక వీరిద్దరికీ పెళ్ళయ్యాక ‘మజిలీ’ చిత్రం చేశారు.

అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే మధ్యలో వచ్చిన ‘ఆటో నగర్ సూర్య’ చిత్రం మాత్రం పెద్దగా ఆడలేదు. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు మరోసారి చైతన్య, సమంత లు కలిసి నటించబోతున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే… శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం తరువాత చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇందులో హీరోయిన్ గా సమంత అయితేనే బాగుంటుందని దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పాడట.

స్క్రిప్ట్ కూడా చైతన్యకు బాగా నచ్చడంతో ఓకే సమంతకే ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో సమంతకు కూడా విక్రమ్ స్టోరీ వినిపించగా వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం. నిజానికి ‘మజిలీ’ సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు ఎన్నో మార్పులు చేస్తేనే కానీ ఓకే చెప్పని సమంత..దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ కు మాత్రం వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. గతంలో విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సమంత కూడా ‘మనం’ ’24’ వంటి చిత్రాలు చేసింది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus