మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!

రష్యా వాళ్ళు కనిపెట్టిన ‘ఫేస్ యాప్’ మన యంగ్ హీరోలను .. క్రికెటర్ లను, ముసలి వాళ్ళుగా మార్చి చూపించి గతంలో పెద్ద రచ్చచేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. అక్కడితో మన నెటిజన్లు ఊరుకోలేదు.. చాలా మంది ఈ యాప్ ను ఉపయోగించి వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వచ్చాక.. ఆ లుక్ ఎలా ఉంటుందో చెక్ చేసి చూసుకున్నారు. తరువాత ఈ యాప్ మనకు ‘జంబలకిడిపంబ’ సీక్వెల్ ను కూడా చూపించింది. మన టాలీవుడ్ స్టార్ నటీమణులను అబ్బాయిలను చేసి చూపించి మరో సెన్సేషన్ కు పునాది వేసింది. అంటే నిజంగా కాదు … మన స్టార్ నటీమణులు అబ్బాయిలైతే ఎలా ఉంటారు? అలా వారిని అబ్బాయిలుగా మార్చి చూపించింది.అవి కూడా తెగ వైరల్ అయ్యాయి.

అటు తరువాత టాలీవుడ్ హీరోలను కూడా అమ్మాయిలను చేసేసింది. అవును.. మన హీరోల మొహాలను అమ్మాయిలుగా మార్చి చూపించింది.అంటే 1992లో వచ్చిన ఇ.వి.వి గారి ‘జంబలకిడిపంబ’ స్టయిల్లో అన్న మాట.! ‘ఆ చిత్రంలో ‘మగవారు ఆడవారిగా మారడం..ఆడవారు మగ వారిగా మారడం’ అనే కాన్సెప్ట్ ను చాలా కామెడీగా చూపించారు ఇ.వి.వి.సత్యనారాయణ. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమాని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇప్పటి వరకూ హీరోలు, హీరోయిన్లను మాత్రమే మార్చి చూపించింది ఆ యాప్. ఇప్పుడు మన టాలీవుడ్ డైరెక్టర్లను కూడా అమ్మాయిలను గా మార్చి చూపించింది. దీనిని బట్టి చూస్తుంటే ‘జంబలకిడిపంబ’ కాన్సెప్ట్ ను ఫేస్ యాప్ ఇప్పట్లో ఆపేలా లేదని చెప్పొచ్చు. ఇక అమ్మాయిలుగా మారిన మన డైరెక్టర్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1)తరుణ్ భాస్కర్

2)వంశీ పైడిపల్లి

3)ఎస్.ఎస్.రాజమమౌళి

4)సుకుమార్

5)క్రిష్ జాగర్లమూడి

6)పూరి జగన్నాథ్

7) సందీప్ రెడ్డి వంగా

8)సురేందర్ రెడ్డి

9)త్రివిక్రమ్ శ్రీనివాస్

10)రాంగోపాల్ వర్మ

11)బోయపాటి శ్రీను

12)తేజ

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus