ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వారిలో రవితేజ కూడా ఉంటాడు..! ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో లైట్ మెన్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. తరువాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాడు రవితేజ. ‘కర్తవ్యం’ ‘అల్లరి ప్రియుడు’ ‘వారసుడు’ ‘నిన్నే పెళ్లాడతా’ ‘సముద్రం’ వంటి చిత్రాల్లో నటించిన రవితేజకు..దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ చిత్రం కాస్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే లైఫ్ ఇచ్చింది మాత్రం మన పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ వంటి చిత్రాలతో రవితేజ ను స్టార్ ను చేసాడు పూరి.ఆ చిత్రాల ద్వారా అతనిలో మాస్ యాంగిల్ ను బయటకు తీసాడు పూరి. ఆ తరువాత రవితేజకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి.. ఆ కష్టం తెలుసుకుని.. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న ఎంతో మందికి డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడు రవితేజ. మొదట్లో రవితేజకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి.. దగ్గరుండి కొత్త కుర్రాళ్లతో సినిమాలు చేయించుకున్నాడు రవితేజ. అతను పరిచయం చేసిన శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను,హరీష్ శంకర్.. వంటి వారు స్టార్ డైరెక్టర్లు గా ఎదిగారు. కొద్దిమంది సక్సెస్ కాలేకపోయారు కానీ వాళ్ళు కూడా ట్యాలెంట్ ఉన్న దర్శకులే అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఎవరు..? ఏ సినిమాలతో పరిచయం అయ్యారు? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) శ్రీను వైట్ల : నీకోసం

2) అగస్త్యన్ : ఈ అబ్బాయి చాలా మంచోడు

3) యోగి : ఒక రాజు ఒక రాణి

4)ఎస్.గోపాల్ రెడ్డి : నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్

5)బోయపాటి శ్రీను : భద్ర

6) హరీష్ శంకర్ : షాక్

7)సముద్ర ఖని : శంభో శివ శంభో

8) గోపీచంద్ మలినేని : డాన్ శీను

9)కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ : పవర్

10) విక్రమ్ సిరికొండ : టచ్ చేసి చూడు

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus