OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Advertisement

పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, పవన్ కెరీర్‌లో సరైన సక్సెస్ పడలేదు.

OG

‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా, అభిమానులు ఆశించిన రేంజ్ ‘క్లీన్ హిట్’ లిస్టులో అవి చేరలేకపోయాయి.

కానీ, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజి’ (OG) ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా, పవన్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.’OG’ తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అభిమానులను డిజప్పాయింట్ చేయకపోవడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు పవన్ నెక్స్ట్ సినిమా ఏంటా? అనే ఆశక్తి అందరిలో నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలి. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోపక్క ‘ఓజి’ సీక్వెల్ ఉంటుందని పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సుజిత్ నానితో ‘బ్లడీ రోమియో’ తెరకెక్కించే పనిలో పడ్డాడు.మరోపక్క ‘ఓజి’ సీక్వెల్ స్క్రిప్ట్ పని కూడా మొదలుపెట్టాడు. దీనికి ‘ఓజి రిటర్న్స్’ ‘ది రిటర్న్ ఆఫ్ ఓజి’ వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. నిర్మాత కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగాన్ని డీవీవీ ధానయ్య నిర్మించారు. రెండో భాగాన్ని.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై టిజి విశ్వప్రసాద్ నిర్మించనున్నారు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై పవన్ కళ్యాణ్, అలాగే సుజీత్ కూడా ఈ సీక్వెల్ కి నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus