Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Advertisement

కాంతారా సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా అందుకుంది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాంతారా చాప్టర్ 1 కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kantara

అయితే, తాజా సమాచారం ప్రకారం మూడో భాగం ప్రారంభానికి ముందే కొన్ని అంతర్గత సమస్యలు తలెత్తినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యంపై కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి సతీమణి ని కో ప్రొడ్యూసర్ గా చేర్చుకోమని కోరగా, నిర్మాణ సంస్థ అందుకు సుముఖంగా లేదని సమాచారం. ఈ విషయంపై నిర్మాత సంస్థ హోంబాలే ఫిల్మ్స్ మరియు హీరో మధ్య చర్చలు జరుగుతున్నాయని వినికిడి.

ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ఈ ఆర్థిక మరియు క్రియేటివ్ అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు కదిలే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, అభిమానులు మాత్రం “కాంతారా 3 ఎప్పుడు మొదలవుతుంది?” అనే ప్రశ్నతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అన్ని సమస్యలు సర్దుబాటు అయితే, త్వరలోనే మూడో భాగంపై స్పష్టత వచ్చే అవకాశముంది. లేదంటే ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus