‘ప్రభాస్ 21’ బాహుబలిని మించెయ్యడం గ్యారంటీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ను ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ.. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ .. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. బడ్జెట్ కూడా ఎక్కువ పెడతారు అని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటికి మొన్న ‘సాహో’ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని సమాచారం.ఈ చిత్రం నిర్మాత అశ్వినీదత్ … ఏకంగా 350కోట్ల పైనే బడ్జెట్ ను అనుకుంటున్నారట.బడ్జెట్ అయితే బాహుబలిని మించెయ్యడం గ్యారెంటీ అని తెలుస్తుంది.

హాలీవుడ్ నటులను కూడా తీసుకోవాలి … విదేశాల్లో షూటింగ్ చెయ్యాలి అని మొదట అనుకున్నారు. కానీ ఓ వైరస్ మహమ్మారి వల్ల ఇప్పుడు అది కుదిరేలా లేదు. అందుకే హైదరాబాద్ లోనే భారీ సెట్ ఒకటి వేసి.. అందులోనే షూటింగ్ చేయబోతున్నారట. అలా అయితే ఈ చిత్రాన్ని కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. కొందరు ఈ చిత్రం ‘సైన్స్ ఫిక్షన్’ నేపథ్యంలో ఉంటుందని.. మరికొందరు అయితే ‘మూడవ ప్రపంచ యుద్దానికి దారి తీసే పరిస్థితులు ఏంటి?’ అనే లైన్ తో ఉంటుందని చెబుతున్నారు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus