Custody: ‘కస్టడీ’ మేకర్స్ తెలివైన డెసిషన్..!

‘థాంక్యూ’ వంటి క్లాస్ మూవీ తర్వాత నాగ చైతన్య నుండి వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘కస్టడీ’. ఈరోజు తెలుగుతో పాటు.. తమిళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. ‘బంగార్రాజు’ తర్వాత నాగ చైతన్య సరసన మరోసారి కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈరోజు రిలీజ్ అయిన ‘కస్టడీ’ చిత్రానికి పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.

(Custody) సినిమా చూసినవారంతా నాగ చైతన్య నటన సూపర్ అని. అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లకి ధీటుగా నటించాడని అంటున్నారు. తప్పకుండా ఈ మూవీ నిలబడే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది అనే కంప్లైంట్ ఉంది. ఒకే ఎపిసోడ్ ను మూడు,నాలుగు సార్లు రిపీట్ చేసినట్లు ఉంది అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. అది కాకుండా సినిమా అంతా బాగానే ఉందనే టాక్ వినిపిస్తోంది.

అది కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే చెబుతున్నారు. తమిళంలో ఆ కంప్లైంట్ అయితే లేదు. దీంతో చిత్ర బృందం అప్రమత్తమై సెకండ్ హాఫ్ లో కొంత పోర్షన్ ను ట్రిమ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలా కనుక చేస్తే ‘కస్టడీ’ వీకెండ్ మొత్తం మంచిగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, ‘కార్తీక దీపం’ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్(వంటలక్క) కూడా ఒకటి రెండు సార్లు కనిపించింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus