Custody Twitter Review: ‘కస్టడీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Advertisement

అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది ‘కస్టడీ’ తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. మే 12న అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. (Custody) ‘కస్టడీ’ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యిందని.. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగానే ఉందని.

ఇక సెకండ్ హాఫ్ కూడా అదే మూడ్ లో వెళ్లిందని. క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా సాగిందని.. . ఓవరాల్ గా ‘కస్టడీ’ మంచి జ్ టాక్ తో ఓకె అనిపించిందని అంటున్నారు. నాగ చైతన్య .. అరవింద స్వామితో సమానంగా నటించి ఆశ్చర్యపరిచాడని.. అతని లుక్స్ కూడా బాగున్నాయని, కృతి శెట్టి కూడా బాగా చేసిందని, నేపథ్య సంగీతం కూడా బాగుందని అంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus