స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ పోలీసులు.. అల్లు అర్జున్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించాడని జరిమానా విధించారు. ఇటీవల హిమాయత్ సాగర్ ప్రాంతంలో అబ్దుల్ ఆజం అనే వాహనదారుడు టీఎస్09ఎఫ్జీ 0666 నంబర్ గల ఓ వాహనాన్ని గుర్తించి ట్రాఫిక్ పోలీసులకు పిర్యాదు చేసాడు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రత్యేకంగా వెళుతున్న ఆ వాహనాన్ని గమనించాడు. క్యారవాన్ అద్దాలు పూర్తిగా బ్లాక్ షేడ్ తో కప్పబడి ఉన్నాయి. రాష్ట్రంలో బ్లాక్ షేడ్ ఉన్న అద్దాల పై ఎప్పుడో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇక శంషాబాద్ పోలీసులు ఆ వాహనం ఎవరిదా అని ఆ నంబర్ పై విచారణ చేయగా.. ఆ వాహనం అల్లు అర్జున్ దే అని తేలింది. ఇటీవల అల్లు అర్జున్ సుమారు 7 కోట్లు పెట్టి క్యాన్ వ్యాన్ డిజైన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎంతో స్టైలిష్ గా ఈ ‘కార్ వ్యాన్’ దేజినే చేయించుకున్నాడు బన్నీ. ఇప్పుడు ఆ కర్ వ్యాన్ పైనే కంప్లైంట్ ఫైల్ అయ్యింది. ‘రూల్స్ అందరూ పాటించాల్సిందే’ అని పోలీసులు మరోసారి నిరూపించారు. మొన్నటికి మొన్న రాంగోపాల్ వర్మ హెల్మెంట్ లేకుండా బండి పై ట్రిపిల్ రైడింగ్ చేసారని కూడా పోలీసులు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీని కూడా వారు వదల్లేదు.