Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Advertisement

అడివి శేష్ సినిమా అంటే ఆడియన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఉంటాయి. కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు అడివి శేష్. అతను హీరోగా రూపొందిన మరో వైవిధ్యమైన సినిమా ‘డెకాయిట్'(Dacoit).

Dacoit Collections

‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థపై సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

టీజర్, ట్రైలర్, ‘రుబారు’ ‘చుచ్చుబుడ్డి’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే

తెలంగాణ  3.30 cr
సీడెడ్ 0.42 cr
ఆంధ్ర(టోటల్)  1.85 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ 2.4 cr
ఓవర్సీస్ 4.15 cr
వరల్డ్ వైడ్ టోటల్ 12.12 cr

‘డెకాయిట్’ చిత్రానికి రూ.30 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.12.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.23 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.18.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus