Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

అడివి శేష్ సినిమా అంటే ఆడియన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఉంటాయి. కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు అడివి శేష్. అతను హీరోగా రూపొందిన మరో వైవిధ్యమైన సినిమా ‘డెకాయిట్'(Dacoit). ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థపై సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Dacoit Collections

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టీజర్, ట్రైలర్, ‘రుబారు’ ‘చుచ్చుబుడ్డి’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ అడివి శేష్ క్రేజ్ కారణంగా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.వీక్ డేస్ లో కొంత డౌన్ అయినా.. ఓకే అనిపిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

తెలంగాణ  6.05 cr
సీడెడ్ 0.82 cr
ఆంధ్ర(టోటల్)  3.96 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 10.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ 5.51 cr
ఓవర్సీస్ 5.45 cr
వరల్డ్ వైడ్ టోటల్ 21.79 cr(షేర్)

‘డెకాయిట్’ (Dacoit) చిత్రానికి రూ.30 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా వసూళ్ళు పర్వాలేదు అనిపించాయి. 6 రోజులు కలుపుకుని రూ.21.79 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.40.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus