Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన కారును బహకరించిన నిర్మాత!

ఈ మధ్యకాలంలో సినిమా కనుక ఊహించిన దాని కన్నా మంచి సక్సెస్ అవడంతో నిర్మాతలు దర్శకులకు హీరోలకు ఖరీదైన కానుకలు ఇవ్వడం ఫ్యాషన్ అయింది. ఇలా ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు డైరెక్టర్లకు హీరోలకు ఖరీదైన కార్లను బహుకరించిన విషయం మనకు తెలిసిందే.తాజాగా నాని హీరోగా నటించిన దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు కూడా దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఖరీదైన కారును బహుకరించారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా.

ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టడంతో నిర్మాతలు భారీ లాభాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత చెరుకూరి సుధాకర్ దసరా చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ బహుకరించారు. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మాత్రం ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుకరించినట్లు సమాచారం.

ఈ కారు విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఇలా సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ పొందినటువంటి డైరెక్టర్ కి ఈ విధమైనటువంటి కానుకను అందజేశారు. ఇక దసరా సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన (Srikanth Odela) పైఇప్పటికే పలువురు హీరోలు నిర్మాతలు చూపు పడిందని చెప్పాలి. అయితే ఈయన తన తదుపరి సినిమాని అఖిల్ అక్కినేని చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus