Dasara Movie: మరో అరుదైన రికార్డు కొట్టిన నాని ‘దసరా’

  • April 6, 2023 / 10:24 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా'(Dasara) సినిమా మార్చ్ 30 న శ్రీరామనవమి కానుకగా విడుదలై సూపర్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఏక కాలంలో విడుదలైంది. నాని నెవర్ బిఫోర్ మాస్ పెర్ఫార్మన్స్ , కీర్తి సురేష్ నేచురల్ పెర్ఫార్మన్స్ … దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్ కలగలిపి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

వరల్డ్ వైడ్ గా రూ.47.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి బయ్యర్స్ ను లాభాల బాట పట్టించింది. ఇక 7 వ రోజు కలెక్షన్లతో ఈ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం రివీల్ చేయడం జరిగింది. నాని కెరీర్లో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీ ఇది.

మిడ్ రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ తో ఈ ఫీట్ సాధించగా, వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ ‘ఎఫ్3′(మల్టీస్టారర్) లతో , రవితేజ ‘ధమాకా’ తో , వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో ఈ ఫీట్ ను సాధించగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నాని కూడా ఎంటర్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ వీకెండ్ కూడా ‘దసరా’ గట్టిగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus