Dasara: నాని దసరా మూవీ టికెట్ రేట్లు ఎంతో తెలుసా?

నాని హీరోగా తెరకెక్కిన దసరా (Dasara) మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. నాని గత సినిమాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు టికెట్ రేట్ల విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తక్కువ టికెట్ రేట్లతోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా టికెట్ రేట్లు 175 రూపాయల నుంచి 295 రూపాయల రేంజ్ లో ఉన్నాయని బోగట్టా. పెద్ద హీరోల సినిమాల టికెట్ రేట్లతో పోల్చి చూస్తే ఈ మొత్తం తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాలను ఎంచుకుంటూ నాని కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు. హిందీలో కూడా నానికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని నాని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. దసరా సినిమా నాని మార్కెట్ ను రెట్టింపు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ఈ సినిమాకు టికెట్స్ దొరకడం కష్టమని తెలుస్తోంది. ఓపెనింగ్స్ కు సంబంధించి నాని ఖాతాలో మరో రికార్డ్ చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాని ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేయడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో నాని స్థాయిలో ఏ హీరో ప్రమోషన్స్ లో పాల్గొనలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెటిజన్లు సతం నానిని తెగ మెచ్చుకుంటున్నారు. నాని పారితోషికం అంతకంతకూ పెరుగుతోంది. నాని ఇతర భాషల్లో సైతం ఊహించని రేంజ్ లో పాపులారిటీని పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus