Dasara: అలాంటి సీన్ కి నేను బి.జి.ఎం చేయను అని ‘దసరా’ సంగీత దర్శకుడు గొడవ పెట్టాడట!

  • April 4, 2023 / 04:49 PM IST

సంతోష్ నారాయణ్ అలియాస్ సంతోష్ నారాయణన్ .. కోలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ‘దసరా’ తో టాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైంధవ్’ , ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలకు కూడా ఈయనే సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా.. ‘దసరా’ సినిమాలో ఓ సీన్ కు ఈయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టను అని గొడవ చేసి వెళ్ళిపోయాడట. ఈ విషాయాన్ని నాని తెలియజేశాడు.

సంగీత దర్శకులతో ఎప్పుడూ ఓ సమస్య ఉంటుంది. వాళ్ళ నుండి మంచి మ్యూజిక్ రాబట్టుకోవాలి అంటే సీన్ కరెక్ట్ గా చెప్పాలి. ఒక్కోసారి కొన్ని సీన్లకు లాజిక్స్ ఉండవు, ఎమోషన్స్ ఉంటాయి. అదే విధంగా ‘దసరా’ లో కూడా ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో హీరోయిన్ ను విధవరాలుగా చేస్తుంటారు. ఆ టైంలో హీరో నాని వెళ్లి ఆమె మెడలో తాళికడతాడు.

ఇది ఎందుకో చెబితే సినిమా ఇంకా చూడని వాళ్ళ మూడ్ ను స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కానీ ఈ సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా..! కానీ చెప్పుకోడానికి అంత అంతలా ఉండదు..! సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కి కూడా ఇలాగే అనిపించింది. అందులోనూ ఆయన పద్ధతులు, సంప్రదాయాలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారట.

అందుకే ఈ సీన్ కు (Dasara) నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టను అని గొడవ పెట్టాడట. దీంతో డైరెక్టర్ శ్రీకాంత్ వెళ్లి ఆయనకు ముందు నుండి కథ అంతా వివరించాడట. అప్పుడు సూపర్ అని చెప్పి వచ్చి నేపధ్య సంగీతం అద్భుతంగా కొట్టినట్టు నాని వివరించాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus