Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • February 27, 2026 / 08:33 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రాజీవ్ కనకాల (Hero)
  • NA (Heroine)
  • వాసంతిక, ఉదయభాను, గాయత్రి భార్గవి, హిమబిందు తదితరులు (Cast)
  • కృష్ణ పోలూరు (Director)
  • కె.వి.శ్రీరామ్ (Producer)
  • శ్రీరామ్ మద్దూరి (Music)
  • రామ్ కె.మహేష్ (Cinematography)
  • చంద్రశేఖర్.జి.వి (Editor)
  • Release Date : ఫిబ్రవరి 27, 2026
  • సౌత్ ఇండియా స్క్రీన్స్ (Banner)

జీ5 సంస్థ నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్ “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు”. రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయభాను ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ కి “రెక్కీ” ఫేమ్ కృష్ణ పోలూరు దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఓ మోస్తరు ఆసక్తి నెలకొల్పింది. 6 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఏమేరకు ఆకట్టుకుంది? కృష్ణ మళ్లీ రెక్కీ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగారా లేదా అనేది చూద్దాం..!!

Daughter Of Prasad Rao Web-Series Review

Daughter Of Prasad Rao Kanabadutaledhu Web-Series Review and Rating

కథ: తన కుమార్తె స్వాతి (వాసంతిక) ఫోన్ ఎత్తడం లేదు అనే కంగారులో.. ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేస్తాడు ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల). హాస్టల్ లో ఎవరికీ స్వాతి ఎక్కడికి వెళ్లిందో తెలియదు, దాంతో ఒక్కసారిగా అది సెన్సేషన్ అయిపోతుంది. మీడియా ఎంట్రీతో పోలీస్ యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. అసలు స్వాతికి ఏమైంది? ఎందుకని కనిపించడం లేదు? పోలీసులు ఈ కేస్ ను ఎలా ఛేదించారు? ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎంతలా నలిగిపోయారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు” వెబ్ సిరీస్.

Daughter Of Prasad Rao Kanabadutaledhu Web-Series Review and Rating

నటీనటుల పనితీరు: తండ్రి పాత్రలో తన సీనియారిటీతో మరోసారి జీవించేశాడు. ముఖ్యంగా మొదటిసారి కూతురి ఆఫీస్ కి వెళ్లే సీన్ మరియు 6వ ఎపిసోడ్ లో రివీల్ చేసే సందర్భంలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక ప్రస్తుతం తరం అమ్మాయిగా కూతురు పాత్రలో వాసంతిక మంచి నటనతో అలరించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో రెగ్యులర్ & టెంప్లేట్ బాడీ లాంగ్వేజ్ లోనే కనిపించింది. అయితే.. సిన్సియారిటీ పండించడంలో తన సత్తా చాటుకుంది. అలాగే.. ఈ సిరీస్ లో సర్ప్రైజ్ క్యాస్టింగ్ గాయత్రి భార్గవి, ఆమెను ఎంచుకోవడం వల్ల ఆ పాత్ర ఎండింగ్ అనేది ఎవరూ ఊహించలేరు కానీ, చివర్లో పండించాల్సిన కోపంతో కూడిన అక్కసును ఆమె క్యారీ చేయలేకపోయింది. బిందు చంద్రమౌళి తల్లి పాత్రలో భావోద్వేగాన్ని చక్కగా పోషించింది. మిగతా సహాయ నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Daughter Of Prasad Rao Kanabadutaledhu Web-Series Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ వర్క్ వంటివన్నీ బాగున్నాయి. AIని అవసరమైన మేరకు డీసెంట్ గా వినియోగించుకున్నారు. తక్కువ లొకేషన్స్ లో మంచి అవుట్ పుట్ ఇవ్వగలిగారు, అందుకు ప్రొడక్షన్ టీమ్ ప్లానింగ్ ని మెచ్చుకోవాలి.

దర్శకుడు కృష్ణ కొంచం రిస్క్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే చాలా హై నోట్ లో స్టార్ట్ అయ్యే సిరీస్ కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంత చిన్న పాయింట్ తో సిరీస్ ని నడిపించడం అనేది మామూలు విషయం కాదు. అది ఎంత నిజాయితీగా ఉన్నా, రిలేటబుల్ గా ఉన్నా, సినిమాటిక్ హై ఇవ్వనప్పుడు, ఏముందిలే అనిపించకమానదు. కానీ.. కృష్ణ మాత్రం ఆ రిస్క్ తీసుకుని అలా అనుకున్న ప్రేక్షకులే 6వ ఎపిసోడ్ లో షాక్ అయ్యేలా చేసి, ఆ సింపుల్ పాయింట్ కి మంచి ఎమోషన్ యాడ్ చేసి ముగించారు. ముఖ్యంగా 6 ఎపిసోడ్లలో సిరీస్ ని ముగించడం, సీజన్ 2 కోసం అనవసరంగా సాగదీయకపోవడం సంతృప్తినిచ్చింది. సో, దర్శకుడిగా కృష్ణ మరోసారి అలరించారనే చెప్పాలి. అలాగే.. డైలాగ్ రైటర్ శృతి ప్రాసలతో విసిగించకుండా సింపుల్ బట్ ఇంపాక్ట్ఫుల్ డైలాగులతో సిరీస్ కి హెల్ప్ అయ్యింది.

Daughter Of Prasad Rao Kanabadutaledhu Web-Series Review and Rating

విశ్లేషణ: ఈమధ్యకాలంలో చూసిన చాలా తెలుగు సిరీస్ లు అనవసరమైన విషయాల్ని హైలైట్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి నానా హడావుడి పడుతున్నాయి. టార్గెట్ ఆడియన్స్ తో సంబంధం లేకుండా అన్నీ సిరీసుల్లోనూ శృతిమించిన శృంగారం లేదా హింస అనేవి కామన్ అయిపోయాయి. అలాంటి తరుణంలో అటువంటి అనవసరమైన సెన్సేషనలైజేషన్ ఏమీ లేకుండా, కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సిరీస్ గా “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు”ని తీర్చిదిద్దడం అనేది ప్రశంసార్హం. వాసంతిక, రాజీవ్ కనకాల చక్కని నటన, కృష్ణ స్క్రీన్ ప్లే & థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ను ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా జీ5 యాప్ లో చూడొచ్చు.

Daughter Of Prasad Rao Kanabadutaledhu Web-Series Review and Rating

ఫోకస్ పాయింట్: తెలుగు ఓటీటీ స్పేస్ లో బెస్ట్ థ్రిల్లింగ్ డ్రామా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #D/O Prasad Rao
  • #Gayatri Bhargavi
  • #Hima Bindu
  • #Rajiv Kanakala
  • #Udaya bhanu

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

40 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version