అగ్ర హీరో కథకు వాళ్లు ఓకే.. మరి ఆయన కూడా యస్‌ అంటారా?

  • July 27, 2024 / 08:15 PM IST

హీరోలకు కథలు చెప్పడం అంటే.. కేవలం హీరోలకు మాత్రమే కాదు. వాళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవాళ్లకూ చెప్పడం అని అంటుంటారు. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లు ఉన్నాయి అని చెబుతుంటారు. తాజాగా ఓ అగ్ర హీరోకు సంబంధించి ఇదే జరిగింది అంటున్నారు. ఆయనతో సినిమా చేయాలని చాలా రోజులుగా ఓ అగ్ర నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక 50 చిత్రాల మార్కును దాటిన ఆయనకు ఆ హీరోతో సినిమా చేయాలనే కోరిక తీరే రోజు దాదాపు దగ్గరకు వచ్చింది అంటున్నారు.

ఆ నిర్మాత టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోలంద‌రితో సినిమాలు తీశారు. కానీ ఓ ఇద్దరు సీనియర్‌ స్టార్‌ హీరోలు పెండింగ్‌లో ఉన్నారు. అందులో ఒకరితో సినిమా ఇప్పుడు ఓకే అయింది అంటున్నారు. గత కొన్ని రోజులుగా క‌థ‌లు సిద్ధం చేయిస్తున్న‌ట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన సిద్ధం చేయించిన ఓ కథను ఆ హీరో కుమార్తెలు విన్నారట. వాళ్లకు బాగా నచ్చిందని, నెక్స్ట్‌ ఆ హీరో ఇప్పుడు వింటారు అని చెబుతున్నారు.

కుమార్తె ఓకే అంటే కథలు ఓకే చేస్తున్న ఆ హీరో ఇప్పడు కుమార్తెలు ఓకే అంటే చేస్తున్నారట. అలా ఇద్దరి దగ్గర ఓకే చేయించుకున్న ఆ కథ.. నెక్స్ట్‌ హీరో దగ్గరకు వచ్చిందట. ఆయన ఓకే చెప్పడం దాదాపు ఖాయం కాబట్టి.. ఆ నిర్మాత సినిమా ప్రారంభోత్సవం పనులు మొదలెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఆ హీరోకు అదేనండి హీరో కుమార్తెలకు క‌థ చెప్పిన ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఇంకా తెలియడం లేదు.

ఎప్పుడో మైల్‌స్టోన్‌ వందో సినిమా ఛాన్స్‌ వస్తుందనుకున్న ఆ నిర్మాతకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ నెంబరు దక్కింది అని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చు అని చెబుతున్నారు. ఈ సినిమా ఓకే చేసుకుంటున్నట్లే చిరంజీవి సినిమాను కూడా ఆ నిర్మాత ఓకే చేయించుకుంటారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus