David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement

తెలుగు సినిమాలను ఆ మాటకొస్తే సౌత్‌ సినిమాలను బాలీవుడ్‌కి తీసుకెళ్లి రీమేక్‌ చేసి.. ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ ధావన్‌. మాజీ స్టార్‌ హీరో గొవిందాతో ఆయన చేసిన సినిమాలు, సాధించిన విజయాలు బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా తెలుసు. ఎందుకంటే ఆయన తన కెరీర్‌లో 45 సినిమాలకు దర్శకత్వం వహిస్తే.. అందులో 35కిపైగా సినిమాలు రీమేక్‌లు/ స్ఫూర్తి పొంది తీసిన సినిమాలే. ఇప్పుడు ఆయన తన కొడుకు, యువ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌తో ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’ అనే సినిమా చేశారు.

David Dhawan

ఈ సినిమా ప్రచారం సందర్భంగా డేవిడ్‌ ధావన్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌ గురించి మాట్లాడారు. ఇకపై నేను సినిమాలు చేయకూడదు అనుకుంటున్నా. ఇదే నా చివరి సినిమా కూడా కావచ్చు. ఈ సినిమా తర్వాత నేను వరుణ్‌కు తండ్రిగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నాకు కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని డేవిడ్‌ చెప్పుకొచ్చారు.

మా కాలంలో సినిమాలు నమ్మకం మీద ఆధారపడి నడిచేవి. సల్మాన్ ఖాన్‌, గొవిందా, సంజయ్‌ దత్‌.. ఇలా హీరోలు ఎప్పుడూ పూర్తి స్క్రిప్ట్‌లు వినేవారు కాదు. మేం సీన్స్‌ వివరిస్తే వాళ్లు తమదైన శైలిలో చేసేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని నాటి – నేటి బాలీవుడ్‌ గురించి చెప్పుకొచ్చారు డేవిడ్‌. అయితే ఈ పరిస్థితుల మార్పే తాను సినిమాలు ఆపేయడానికి కారణమా అనేది మాత్రం ఆయన చెప్పలేదు.

పైన డేవిడ్‌ గురించి చెబుతూ రీమేక్‌ల కింగ్‌ అన్నాం కదా. ఆయన తీసిన ‘కూలీ నెం 1’, ‘జుడ్వా’, ‘జుడ్వా 2’, ‘రాజా బాబు’, ‘సాజన్‌ చలే ససురాల్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఖిలాడీ’, ‘బీవీ నెంబర్‌ 1’, ‘మే తేరా హీరో’, ‘ఘర్వాలీ బాహర్వాలీ’ సినిమాలు అలా చేసినవే. అన్నీ హిట్‌ సినిమాలే.

ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus