Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » 2017 లో తొలిరోజు ఎక్కువగా వసూలు చేసిన తెలుగు చిత్రాలు

2017 లో తొలిరోజు ఎక్కువగా వసూలు చేసిన తెలుగు చిత్రాలు

  • December 23, 2017 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 లో తొలిరోజు ఎక్కువగా వసూలు చేసిన తెలుగు చిత్రాలు

తెలుగు సినిమా అనేక రకాలుగా మార్పును సంతరించుకుంటోంది. నిర్మాణ ఖర్చులు పెరగడమే కాదు కలెక్షన్లు అందుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి. అయితే సినిమా విజయంలో తొలి రోజు కలక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఫస్ట్ డే ఎక్కువగా వసూలు చేసిన టాప్ టెన్ చిత్రాలపై ఫోకస్..

బాహుబలి 2 Baahubali 2రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం మనదేశంలోనే ఒక్కరోజులో 125 కోట్ల గ్రాస్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాలలో 42.90 కోట్ల షేర్ సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఖైదీ నంబర్ 150 Khaidi No 150“ఆట అయినా.. రికార్డ్ ల వేట అయినా…, పోటి అయినా.. కలక్షన్స్ భేటీ అయినా.., ఆయన దిగనంతవరకే
అన్నయ్య దిగాక అందరూ ఇంక తమ్ముళ్లే”.. అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. చిరు తొమ్మిదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ తొలి రోజు 23.73 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటింది.

కాటమరాయుడుKatamarayuduతమ్ముడిగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ అన్నగా కనిపించిన సినిమా కాటమరాయుడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ తొలి రోజు 22.70 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది.

జై లవ కుశ Jai Lava Kusaబాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం సూపర్ హిట్ అయింది. తొలిసారి తారక్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 31 .25 కోట్లు రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో 21.51 కోట్లు వసూలు చేసింది.

దువ్వాడ జగన్నాధంDuvvada Jagannadamసరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వివాదాల నడుమ రిలీజ్ అయి హిట్ అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ డే 16.93 కోట్ల షేర్ వసూలు చేసింది.

స్పైడర్ Spyderకమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ డే నే ప్రపంచవ్యాప్తంగా 41.50 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో 15.55 కోట్ల షేర్ వసూలు చేసింది.

గౌతమీపుత్ర శాతకర్ణి Goutamiputra Shatakarniనటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నందమూరి అభిమానుల మనసుదోచుకుంది. బాలయ్య డైలాగ్స్ తోడు, విజువల్ ఎఫక్ట్స్ అందరినీ అబ్బురపరిచాయి. అందుకే ఈ మూవీ తొలి రోజు 9.45 కోట్ల షేర్ రాబట్టింది.

పైసా వసూల్ Paisa Vasoolనందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందిన “పైసా వసూల్’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 7.74 కోట్లు వసూలు చేసింది.

MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌)MCAవరుస విజయాలు అందుకుంటున్న నాని.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేసిన మూవీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌. గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజున బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 7.46 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

విన్నర్ Winnerగోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన మూవీ ‘విన్నర్’. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే 5.58 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.

కొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేయనున్నాము.. మరి వచ్చే సంవత్సరంలో ఈ జాబితాలో ఎవరి సినిమాలు స్థానం సంపాదించుకుంటాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali 2 Movie
  • #Duvvada Jagannadam
  • #Gautamiputra Satakarni
  • #jai lava kusa
  • #Katamarayudu

Also Read

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

trending news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

12 hours ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

13 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

14 hours ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

14 hours ago

latest news

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

19 hours ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

20 hours ago
Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

21 hours ago
Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

1 day ago
Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version