2017 లో తొలిరోజు ఎక్కువగా వసూలు చేసిన తెలుగు చిత్రాలు

తెలుగు సినిమా అనేక రకాలుగా మార్పును సంతరించుకుంటోంది. నిర్మాణ ఖర్చులు పెరగడమే కాదు కలెక్షన్లు అందుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి. అయితే సినిమా విజయంలో తొలి రోజు కలక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఫస్ట్ డే ఎక్కువగా వసూలు చేసిన టాప్ టెన్ చిత్రాలపై ఫోకస్..

బాహుబలి 2 రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం మనదేశంలోనే ఒక్కరోజులో 125 కోట్ల గ్రాస్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాలలో 42.90 కోట్ల షేర్ సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఖైదీ నంబర్ 150 “ఆట అయినా.. రికార్డ్ ల వేట అయినా…, పోటి అయినా.. కలక్షన్స్ భేటీ అయినా.., ఆయన దిగనంతవరకే
అన్నయ్య దిగాక అందరూ ఇంక తమ్ముళ్లే”.. అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. చిరు తొమ్మిదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ తొలి రోజు 23.73 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటింది.

కాటమరాయుడుతమ్ముడిగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ అన్నగా కనిపించిన సినిమా కాటమరాయుడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ తొలి రోజు 22.70 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది.

జై లవ కుశ బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం సూపర్ హిట్ అయింది. తొలిసారి తారక్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 31 .25 కోట్లు రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో 21.51 కోట్లు వసూలు చేసింది.

దువ్వాడ జగన్నాధంసరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వివాదాల నడుమ రిలీజ్ అయి హిట్ అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ డే 16.93 కోట్ల షేర్ వసూలు చేసింది.

స్పైడర్ కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ డే నే ప్రపంచవ్యాప్తంగా 41.50 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో 15.55 కోట్ల షేర్ వసూలు చేసింది.

గౌతమీపుత్ర శాతకర్ణి నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నందమూరి అభిమానుల మనసుదోచుకుంది. బాలయ్య డైలాగ్స్ తోడు, విజువల్ ఎఫక్ట్స్ అందరినీ అబ్బురపరిచాయి. అందుకే ఈ మూవీ తొలి రోజు 9.45 కోట్ల షేర్ రాబట్టింది.

పైసా వసూల్ నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందిన “పైసా వసూల్’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 7.74 కోట్లు వసూలు చేసింది.

MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌)వరుస విజయాలు అందుకుంటున్న నాని.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేసిన మూవీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌. గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజున బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 7.46 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

విన్నర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన మూవీ ‘విన్నర్’. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే 5.58 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.

కొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేయనున్నాము.. మరి వచ్చే సంవత్సరంలో ఈ జాబితాలో ఎవరి సినిమాలు స్థానం సంపాదించుకుంటాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus