బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్ దశకి చేరుకుంది. మరో మూడువారాల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ టైమ్ లో నాగార్జున సండే ఎపిసోడ్ లో కన్నడ బిగ్ బాస్ హోస్ట్ అయిన సుదీప్ ని హౌస్ మేట్స్ కి పరిచయం చేశాడు. గెస్ట్ గా వచ్చిన సుదీప్ హోస్ట్ గా మారి హౌస్ మేట్స్ ని ప్రశ్నించాడు. ఇందులో కొన్ని ఫన్నీ ప్రశ్నలు ఉన్నా కూడా హౌస్ మేట్స్ మాత్రం సాలిడ్ ఆన్సర్స్ ఇచ్చారు.
ముఖ్యంగా హారికని సుదీప్ అడిగిన ప్రశ్నకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. లాయల్టీ ముఖ్యమా ? గెలుపు ముఖ్యమా అని సుదీప్ అడిగిన ప్రశ్నకి, లాయల్టీగా ఉంటూ గెలవడం ముఖ్యం అని చెప్పింది. ఏదో ఒకటే ఆన్సర్ చేయమన్నప్పుడు నేను గేమ్ లో ఓడిపోయినా పర్లేదు కానీ, లాయల్టీగా ఉంటానని, నాకు నిజాయితీగా గేమ్ ఆడటమే ముఖ్యం అని చెప్పింది హారిక. ఈ ఆన్సర్ తో గెస్ట్ సుదీప్ మనసునే కాకుండా, ఆడియన్స్ మనసుల్ని కూడా గెలుచుకుంది.
ఓడిపోయినా కూడా నిజాయితీగా ఆడితే ఆ ఆత్మసంతృప్తి చాలు అని, నిజాయితీగా ఆడకుండా గెలిచినా కూడా అది భరించలేమని చెప్పింది. హౌస్ మేట్స్ అందర్నీ ఫన్నీ క్వశ్చన్స్ అడిగిన సుదీప్ హారికని మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. మిగతావాళ్లు వాళ్ల స్టైల్లో ఆన్సర్ చెప్పినా, హారిక మాత్రం తడుముకోకుండా హానెస్ట్ గా ఆన్సర్ ఇవ్వడం ప్రేక్షకులకి నచ్చిందనే చెప్పాలి. అదీ మేటర్.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?