NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Advertisement

‘దేవర’ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్'(NTRNeel). డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే.

NTRNeel

అయితే, సినిమాను అనుకున్న టైమ్‌కి ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నీల్ ఇప్పుడు ఓ ఊహించని మాస్టర్ స్కెచ్ వేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్‌ను రంగంలోకి దించారు.

తాజా సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ టీమ్‌లో ‘ప్రస్థానం’ ఫేమ్ డైరెక్టర్ దేవ కట్టా జాయిన్ అయినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. సినిమా పనుల్లో వేగం పెంచేందుకు ప్రశాంత్ నీల్ తన బాధ్యతలను కొద్దిగా పంచుకున్నారట. ఇందులో భాగంగా ‘డ్రాగన్’లోని కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను దేవ కట్టా డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. అంతేకాకుండా, తారక్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారని టాక్.

ఇప్పటికే రాజమౌళి ‘వారణాసి’ ప్రాజెక్ట్‌కు రైటర్‌గా పని చేస్తున్న దేవ కట్టా.. ఇప్పుడు ‘డ్రాగన్’ స్క్రిప్ట్ విషయంలోనూ తన ఇన్‌పుట్స్ ఇస్తున్నారట.దేవ కట్టా పెన్ను నుంచి వచ్చే డైలాగ్స్ ఎంత పదునుగా ఉంటాయో ‘ప్రస్థానం’ ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సమాజాన్ని ప్రశ్నించే ఆయన మార్క్ డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఊరమాస్ మేకింగ్‌కి, తారక్ ఎనర్జీకి.. దేవ కట్టా తూటాల్లాంటి డైలాగ్స్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు.రిలీజ్ డిలే అవుతోందని ఇన్నాళ్లూ ఫీలైన ఫ్యాన్స్‌కు.. ఈ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫుల్ కిక్ ఇస్తోంది.

సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus