R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Advertisement

‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అధినేత ఆర్‌.బి. చౌదరి(R.B.Choudary) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి స్టార్ గా ఎదిగిన ఆయన.. ఈ మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

R.B.Choudary

ఈ వార్త ఒక్క కోలీవుడ్ నే కాదు యావత్ సినీ పరిశ్రమని కలచివేసింది అని చెప్పాలి.  రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో ఆర్.బి.చౌదరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడం గమనార్హం.

కుటుంబ సభ్యులతో కలిసి పర్సనల్ వర్క్ నిమిత్తం ఆయన ఉదయపూర్ వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ద్వంసమవ్వడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.సౌత్ సినిమా గురించి చెప్పుకుంటే ఆర్‌.బి. చౌదరి పేరు ప్రత్యేకంగా లిఖించబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తమిళంలోనే కాదు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించి అందులో కూడా ఎక్కువ విజయాలు సాధించిన నిర్మాతగా ఆర్.బి.చౌదరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకున్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. టాలీవుడ్లో చూసుకుంటే ‘సూర్యవంశం’ ‘రాజా’ ‘నువ్వు వస్తావని’ ‘సంక్రాంతి’ ‘రచ్చ’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు ఆర్.బి.చౌదరి.

హిట్ సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు వాటి ద్వారా ఎంతోమంది కొత్త దర్శకులకి, నటులకి లైఫ్ ఇచ్చిన ఘనత కూడా ఆర్.బి.చౌదరి సొంతం. ‘రంగం’తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న జీవా ఆర్.బి.చౌదరి చిన్న కుమారుడు అని బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అలాగే ‘విద్యార్ధి’ అనే సినిమాతో అతని మరో కుమారుడు  జితన్ రమేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఆర్.బి.చౌదరి మరణవార్తని జీర్ణించుకోలేక టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు మూగబోయాయి అనే చెప్పాలి. చిరంజీవి, విజయ్ వంటి స్టార్ హీరోలు ఆర్.బి.చౌదరి మృతికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus