ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’(Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(పార్ట్ 1) (Devara) . విడుదలై 24 రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.ఆల్రెడీ రూ.500 కోట్లు క్లబ్ లో చేరిన ఈ చిత్రం 4వ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకుంది. ‘దావూది’ సాంగ్ దసరా సెలవులకి యాడ్ చేయడం వల్ల కూడా ‘దేవర’ లాంగ్ రన్ కి బాగా హెల్ప్ అయినట్టు అయ్యింది.
ఇక 24 రోజులకు గాను ‘దేవర’ (Devara) కలెక్షన్స్, అలాగే ప్రాఫిట్స్ లెక్కలు ఒకసారి గమనిస్తే :
నైజాం | 58.02 cr |
సీడెడ్ | 30.09 cr |
ఉత్తరాంధ్ర | 17.16 cr |
ఈస్ట్ | 9.78 cr |
వెస్ట్ | 7.59 cr |
గుంటూరు | 12.08 cr |
కృష్ణా | 8.63 cr |
నెల్లూరు | 5.76 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 149.11 cr |
కర్ణాటక | 15.44 cr |
తమిళనాడు | 2.48 cr |
కేరళ | 0.76 cr |
నార్త్ | 27.82 cr |
ఓవర్సీస్ | 35.05 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 230.66 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 24 రోజులు పూర్తయ్యేసరికి రూ.230.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.55.66 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.