ఇది కొన్నేళ్ల క్రితం నాటి విషయం. గాయకుడు, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఫొటో పెట్టి డిలీట్ చేశాడు. ఆ ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే డిలీట్ చేయడం అంతకుమంచి వైరల్ అయింది. ఆ ఫొటో షేర్ చేయడమే తప్పు అని చెప్పిన.. ఆ ఫొటో గురించి, దాని వెనుక జరిగిన కథ గురించి, డిలీట్ చేసిన విషయం గురించి రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj ) వివరంగా చెప్పుకొచ్చారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు.. ’ పాటతో ఇండియన్ ఫ్యాన్స్‌నే కాదు.. ఆస్కార్ వేదికను కూడా షేక్ చేసిన సింగర్లలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఆయనను ఆ ‘ఫొటో.. డిలీట్’ వెనుక కథేంటి అనే ప్రశ్న అడిగితే.. అప్పుడు జరిగిందంతా చెప్పుకొచ్చారు. రజనీకాంత్‌తో (Rajinikanth) దిగిన ఆ ఫొటోను టీమ్ వద్దని చెప్పినా.. తాను సోషల్ మీడియాలో షేర్ చేసేశాను అని చెప్పాడు. అంతేకాదు జీవితంలో తాను చేసిన తప్పు అదేనని..
అందుకు ఎంతో బాధపడుతున్నానని కూడా చెప్పాడు. తాను నటించిన ‘రంగమార్తాండ’ (Rangamaarthaanda) సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) , రమ్యకృష్ణతో (Ramya Krishnan) మంచి పరిచయం అయిందని, ఆ షూట్‌లో ఉన్నప్పుడు తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని అని ప్రకాశ్‌రాజ్‌కు తెలిసింది. దాంతో ఓసారి తనను పిలిచి రజనీకాంత్ సినిమా షూట్‌కు వెళ్తున్నానని.. వస్తావా అని తీసుకెళ్లారట. అలా ‘అన్నాతే’ సినిమా షూటింగ్‌కు వెళ్లాడు రాహిఉల్. అక్కడ రజనీకాంత్‌కు రాహుల్‌ను ప్రకాశ్‌రాజ్ పరిచయం చేశారట.
అప్పుడు తలైవా మూవీ లుక్‌లో ఉన్నారట. అయినా రిక్వెస్ట్ చేసి కలసి ఓ ఫొటో దిగాడట రాహుల్. ఆ సినిమా లుక్ ఇంకా రిలీజ్ చేయాలేదు కాబట్టి.. ఆ ఫొటో షేర్ చేయొద్దని టీమ్ చెప్పిందట. 10 రోజులు ఆగాక.. ఆనందం తట్టుకోలేక ఆ ఫొటోను షేర్ చేసేశాడు రాహుల్. దీంతో ఆ లుక్ వైరల్‌గా మారింది. విషయం బయటకు రావడంతో నిర్మాణ సంస్థ కంగారు పడిందట. దీంతో రాహుల్ ఆ ఫొటోను డిలీట్ చేసేశాడు. అలా తనకు తెలిసి జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే అని చెప్పాడు.