Vishwak Sen: సినిమాకు హైప్‌ ప్రేక్షకులు ఇవ్వక్కర్లేదా? హీరోలే ఇచ్చుకుంటారా? ఏంటిది విశ్వక్‌?

సినిమాకు బజ్‌ ఎలా వస్తుంది? హైప్‌ ఎలా వస్తుంది? ఈ విషయంలో తెలుగు సినిమా హీరోలు, సినిమా టీమ్‌లు, పీఆర్ టీమ్‌లు.. ఇలా ఒక్కరేంటి అందరికీ ప్రత్యేక శిక్షణా తరగతులు ఇప్పించాలా? ఏమో విశ్వక్‌సేన్‌ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్లుగా ఇండియన్‌ సినిమాలో లేని, వినిపించని కొత్త మాటను ఆయన చెప్పాడు కాబట్టి. దీంతో ఈ విషయం తెలియక స్టార్‌ హీరోలు, స్టార్‌ దర్శకులు సినిమా ప్రచారం కోసం బుర్రలు బద్ధలుకొట్టుకుంటున్నారా? అని అనిపిస్తోంది.

Vishwak Sen

సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఆ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) అని తెలిసిపోయి ఉంటుంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky) . ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల క్రితమే ప్రచారం మొదలుపెట్టినా ఎందుకో కానీ ఆ తర్వాత ఆపేశారు. ఇప్పుడు మరోసారి తాజాగా సినిమా ప్రచారం షురూ చేశారు. ఈ క్రమంలో తన సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగానే ఈ హైప్‌ టాపిక్‌ వచ్చింది.

రిలీజ్‌కు ముందు సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడే హీరోల్లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) , విశ్వ‌క్‌సేన్ ఉన్నారు. సినిమాలను వీలైనంత‌గా త‌న భుజాలపై మోసేస్తుంటారు ఇద్దరూ. ఈ క్రమంలో సినిమా ఫలితం తేడా కొడితే తీవ్రంగా ట్రోలింగ్‌ బారినపడతారు. అందుకేనేమో ఈ ఇద్దరి మీద ట్రోలింగ్ అయినప్పుడు ‘అయ్యో పాపం’ అనేవాళ్లు తక్కువగా ఉంటారు. విజయ్‌ ఇప్పటికే ఈ కాన్ఫిడెన్స్‌ కారణంగా ఇబ్బంది పడ్డాడు.

విశ్వక్‌ కూడా అంతే కాన్ఫిడెన్స్‌తో ‘ఈ సినిమా హిట్టు కొట్ట‌క‌పోతే.. నా పేరు మార్చుకొంటా’ అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. సినిమా వాయిదా పడితే ప్రచారనికి రాను అంటూ శపథాలు కూడా చేస్తుంటాడు. అలాంటి విశ్వక్‌ తన కొత్త సినిమా ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌లో మాట్లాడాడు. ‘‘ఈ సినిమాకు బ‌జ్ లేదు అని అంటున్నారు.. బ‌జ్ లేక‌పోవ‌డం కాదు.. నేనే ఇవ్వ‌లేదు. ఇక నుంచి ఇస్తా” అని అన్నాడు.

అంతేకాదు న‌వంబ‌రు 22న ఈ సినిమా విడుద‌ల అవుతోందని, 21 రాత్రి పెయిడ్ ప్రీమియ‌ర్లు వేస్తున్నామని, 21న రాత్రి సినిమా చూసిన‌వాళ్లు న‌చ్చేలేదు అంటే 22న ఎవ‌రూ థియేట‌ర్ల‌కు రావొద్దని చెప్పాడు. దీంతో ఆ రోజు తేడా కొడితే ‘బజ్‌’ సంగతి తేలిపోద్ది అంటున్నారు. అయినా విశ్వక్‌ ధైర్యానికి విజయం దక్కాలి. ఎందుకంటే ఇలా మాట్లాడేవాళ్లు తక్కువగా ఉంటారు.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 27 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus