Sai Pallavi: సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

అందమైన అమ్మాయి అన్నయ్య అని పిలిస్తేనే బాధపడతాం. అలాంటిది బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అన్నా పిలిస్తే.. చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రముఖ తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌కు (Sivakarthikeyan). తాజా సినిమాలో తనతో కలసి నటించిన హీరోయిన్‌ గురించి చెబుతూ చాలా నెలల క్రితం జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Sai Pallavi

రాజ్‌కుమార్‌ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ ఇటీవల చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే శివకార్తికేయన పైన చెప్పిన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోయిన్‌ సాయిపల్లవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాం. ఈ కార్యక్రమంలో సాయిపల్లవిని ప్రశంసించిన శివ కార్తికేయన్‌…

గతంలో తనకు, సాయిపల్లవికి మధ్య జరిగిన ఓ సరదా సంఘటన గురించి చెప్పుకొచ్చారు. శివకార్తికేయన్‌ గతంలో ఓ టీవీ ఛానల్‌లో పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సాయి పల్లవిని మొదటిసారి కలిశాడట. శివ కార్తికేయన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి ఆమె వచ్చారట. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌ అనేలా సాగుతోంది.

దానికి కారణం ‘ప్రేమమ్‌’ (Premam) సినిమానే. ఆ సినిమాలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయిన శివ కార్తికేయన్‌.. ఆమెకు ఫోన్‌ చేసి ప్రశంసించాడట. దానికి సాయి పల్లవి (Sai Pallavi) ‘థ్యాంక్యూ అన్నా’ అని రిప్లై ఇచ్చిందట. హీరోయిన్‌ అలా అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీలయ్యాడట శివ కార్తికేయన్‌. ఇప్పుడు అదే హీరోయిన్‌తో కలసి నటించాడు. ఇదే కదా ఓ కథానాయకుడు కోరుకున్న గ్రాఫ్‌.

పుష్ప 2’ vs ‘ఆర్ఆర్ఆర్’ : బిజినెస్ లో ఈ తేడా చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus