టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ (Suryadevara Naga Vamsi) .. ఏం మాట్లాడినా సంచలనమే. ఒక్కోసారి ఈయన అత్యుత్సాహంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలోని నెటిజెన్లకి టార్గెట్ అవుతుంటారు. అయితే ఒక్కోసారి ఈయన చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే.. “ఓ ఫ్యామిలీలో 4 మంది సినిమాకి వెళితే టికెట్లకి రూ.1000 , పాప్ కార్న్ కి రూ.500. మొత్తం రూ.1500 పెట్టలేరా? అసలు రూ.1500 లకి 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వస్తుంది.
చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ అంటే సినిమా అండి” అంటూ చెప్పుకొచ్చాడు. ‘దీంతో రూ.1500 నాగవంశీకి పెద్ద విశేషం కాదేమో కానీ, సామాన్యులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అది బిగ్ థింగ్’ అంటూ నాగవంశీ కామెంట్స్ కి అభ్యంతరాలు తెలిపారు నెటిజెన్లు. ఇక లేటెస్ట్ గా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ప్రమోషన్స్ లో మరోసారి ఊహించని కామెంట్స్ చేశాడు నాగ వంశీ. అతను మాట్లాడుతూ.. “కల్చర్ ఎలా తయారయ్యిందంటే.. ఒక రేంజ్ సినిమాలు అంటే, పెద్ద సినిమాలకి పాజిటివ్ టాక్ రాదు.
పెద్ద సినిమాలకి ఫుల్ పాజిటివ్ రివ్యూస్ చెప్పరు. ఎందుకంటే ఫుల్ పాజిటివ్ టాక్ చెబితే.. ‘నన్ను పట్టించుకోరు, నాకు సినిమా చూడటం రాదు’ అని భావించి ఏదో ఒక లాజిక్ వెతికి బాలేదు అని చెబుతారు. నిజంగా సినిమా వాడికి నచ్చినా బాగుంది అని చెప్పడు. లేకపోతే ఎందుకు ఇలా నెగిటివ్ టాక్ చెబుతారో నాకు తెలీదు. ‘సలార్’ (Salaar) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ‘దేవర’ (Devara) వంటి సినిమాలకి చూసుకోండి.
వాటికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద వాటిని ఆ నెగిటివ్ టాక్, రివ్యూస్ అనేవి ఆపలేదు” అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. నాగ వంశీ కామెంట్స్ ని పూర్తిగా ఏకీభవించలేం. ఎందుకంటే ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వంటి సినిమాలకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాగా ఆడింది. కానీ కొంత పాయింట్ అయితే లేకపోలేదు.
భవిష్యత్తులో పెద్ద సినిమాలకి పాజిటివ్ టాక్ అనేది రాదు : నిర్మాత నాగవంశీ @vamsi84 #LuckyBaskharOnOct31st #LuckyBaskhar pic.twitter.com/77kRBQEwvf
— Phani Kumar (@phanikumar2809) October 19, 2024