ఆ విషయంలో దేవికి కంగారేమీ లేదు!

“కుమారి 21 ఎఫ్” సినిమా సక్సెస్ మీట్ లో.. దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తాను అని దర్శకుడు సుకుమార్ ఎనౌన్స్ చేసినదగ్గర్నుంచి “దేవి ఎప్పుడు హీరో అవుతాడు” అని ఎదురుచూస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆ సినిమాలో దేవి సరసన కథానాయికగా ఎవరు నటిస్తారు? దేవి పాత్ర ఎలా ఉండబోతోంది? అని చాలా మంది ఇప్పటికే తెగ ఆలోచించేస్తున్నారు.

కానీ.. దేవిశ్రీప్రసాద్ మాత్రం అస్సలు ఆ విషయం గురించి ఏం పట్టించుకోవట్లేదంట. ప్రస్తుతం అతగాడి దృష్టి మొత్తం తన చేతిలో ఉన్న చిరు 150వ సినిమా మరియు బాలకృష్ణ 100వ సినిమా పైనే ఉన్నాయట. ఈ రెండు సినిమాలు సదరు హీరోలకు మాత్రమే కాక చిత్ర పరిశ్రమకూ మరియు ఆ హీరోల అభిమానులకు చాలా కీలకం.

అందుకే.. ప్రస్తుతానికి తాను హీరో అవ్వాలన్న ఆలోచనను పక్కన పెట్టి, ఆ రెండు సినిమాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో బాణీలు అందించాలన్న తపనతో ఆహరహం శ్రమిస్తున్నాడట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus