నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇక డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ‘డెవిల్’ మూవీ. టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
6.00 cr
సీడెడ్
3.00 cr
ఉత్తరాంధ్ర
2.00 cr
ఈస్ట్
1.20 cr
వెస్ట్
1.00 cr
గుంటూరు
1.30 cr
కృష్ణా
1.50 cr
నెల్లూరు
0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.80 cr
ఓవర్సీస్
2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
20.40 cr (షేర్)
‘డెవిల్’ (Devil) చిత్రానికి రూ.20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.20.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తేనే తప్ప.. ఇంత టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఒక్క ‘బింబిసార’ మినహా కళ్యాణ్ రామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు.