కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీ టాలెంటెడ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో మరే స్టార్ హీరోకి సాధ్యంకాని విధంగా ఏడాదికి 2,3 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా మారి సినిమాలు చేస్తుంటాడు. 2025లో చూసుకుంటే.. ధనుష్ నటించిన 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా ‘కుబేర’ వచ్చింది.అది సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
అటు తర్వాత ‘ఇడ్లీ కొట్టు’ వచ్చింది. దీనికి మంచి టాక్ వచ్చినా… బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ‘ఓజి’ ‘కాంతార 2’ సినిమాల మధ్య ఇది నలిగిపోయింది అనే చెప్పాలి. ఓటీటీలో మాత్రం ‘ఇడ్లీ కొట్టు’ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అటు తర్వాత హిందీలో ‘తెరే ఇష్క్ మే’ అనే సినిమా చేశాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ‘అమర కావ్యం’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాగే తన మేనల్లుడుతో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. అది కూడా బాగానే ఆడింది. ఇక ఈ 2026 లో కూడా ధనుష్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు రెడీ అయ్యాడు. ‘అమరన్’ వంటి రూ.300 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కి జోడీగా స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఎంపికయ్యారు.