మహేష్ తల్లిగా బిచ్చగాడి మథర్!

  • July 26, 2016 / 08:10 AM IST

తెలుగులో ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై అద్భుత విజయం సాధించింది బిచ్చగాడు సినిమా. ఇందులోని మదర్ సెంటిమెంట్ చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ.. అతడి తల్లిగా నటించిన దీపా రామానుజం తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు. దీపాకు తమిళంలో కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంకో పెద్ద అవకాశం లభించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో దీపా రామానుజం.. మహేష్ బాబుకు తల్లిగా నటించబోతుండటం విశేషం. దీపా తెలుగు, తమిళ ప్రేక్షకులిద్దరికీ చేరువైన నేపథ్యంలో ఆమెతో మహేష్ తల్లి పాత్ర చేయిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని మురుగదాస్ భావించి సంప్రదించగా.. ఆమె సంతోషంగా ఒప్పుకుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus