Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

‘ధురంధర్‌’ సినిమా గురించి ఇప్పుడు ఇంత మంది మాట్లాడుతున్నారు అంటే.. సినిమా వసూళ్ల రికార్డులు బద్ధలు కొడుతోంది అంటే.. దాని వెనుక దర్శకుడు ఆదిత్య ధర్‌ ఉన్నారు అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన పనితనాన్ని తక్కువ చేయడం కాదు కానీ.. ఆయన కష్టంతోపాటు నటీనటుల కష్టం కూడా చాలా ఉంది. ఆ సినిమాలో ఒక్కో పాత్రకు ఎవరు సరిపోతారో చూసి, లెక్క కట్టి మరీ తీసుకున్నారు. ఈ కష్టమంతా కాస్టింగ్‌ డైరక్టర్‌ ముకేశ్‌ ఛబ్రాది. ఇటీవల ఆయన గురించి చాలా మాట్లాడుతున్నారు.

Dhurandhar

‘ధురంధర్‌’ సినిమాలో పెద్ద పెద్ద పాత్రలే కాదు.. చిన్న పాత్రల విషయంలోనూ చాలా పెద్ద ప్రాసెస్‌ జరిగింది. ఈ విషయాన్ని ముకేశ్‌ ఛబ్రా చెప్పుకొచ్చారు. ఎంతలా అంటే ఈ సినిమా కోసం కాస్టింగ్‌ పనులు రెండేళ్లపాటు చేశామని చెప్పారు. దీంతో కాస్టింగ్‌ కోసమే ఇన్ని రోజులా గ్రేట్‌ అంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. సినిమాలో ప్రధాన పాత్రలే కాదు.. కాసేపు కనిపించే పాత్రలు కూడా సహజంగా ఉండాలని అనుకున్నారట ఆదిత్య ధర్‌. దీంతో ముకేశ్‌, అతని ఎనిమిది మంది అసిస్టెంట్లు రెండేళ్లు కష్టపడి కాస్టింగ్‌ పనులు చూశారట. ఈ క్రమంలో సుమారు 300 మంది నటులను ఆడిషన్‌ చేశారట.

‘ధురంధర్‌’ సినిమాలో ప్రతినాయకుడిగా అక్షయ్‌ ఖన్నా అదరగొట్టాడు. ఆ పాత్రను ఎంతోమంది తిరస్కరిస్తే అక్షయ్‌కి వచ్చింది. దీని గురించి ముకేశ్‌ ఛబ్రా మాట్లాడుతూ అక్షయ్‌ ఖన్నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని లైట్‌ తీసుకున్నాడట అక్షయ్‌. కానీ ముకేశ్‌ వదల్లేదట. ఒక్కసారి కథ వినమని చెప్పి.. నెరేట్‌ చేయించారట. సినిమా కథ మొత్తం విన్న తర్వాత.. తనదైన శైలిలో ‘ఫంటాస్టిక్‌’ అని అన్నాడట అక్షయ్‌. ఆ తర్వాత ఒక రోజు ఆగి ఫోన్‌ చేసి సినిమాలో నేను యాక్ట్‌ చేస్తున్నా అని చెప్పాడట. ఇక ఐబీ చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌గా నటించిన మాధవన్‌ సెలక్షన్‌ గురించి కూడా ముకేశ్‌ చెప్పారు. ‘రంగ్‌ దే బసంతి’ సినిమా టైమ్‌ నుండి తనకు మాధవన్‌ తెలుసని, అందుకే ‘ధురంధర్‌’ సినిమా విషయంలో తనను నమ్మమని అడిగి ఆ పాత్రకు తీసుకున్నామని చెప్పారు.

 ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus