Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమా ముందుగా 2026, మార్చి 26న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో దాన్ని ఏప్రిల్ 30కి షిఫ్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్‌కు కూడా రావడం కష్టమేనని, మూవీ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అయితే, ఈ డీల్‌లో ఓ స్ట్రిక్ట్ అగ్రిమెంట్ ఉందట.

Peddi

ఒకవేళ ఏప్రిల్ 30న కనుక ‘పెద్ది’ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోతే, డీల్ అమౌంట్‌లో ఏకంగా 30 శాతం కోత విధిస్తారట. దీంతో అలెర్ట్ అయిన బుచ్చిబాబు అండ్ టీమ్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30కే మూవీని దించాలని బ్యాలెన్స్ వర్క్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మధ్యలో రామ్ చరణ్‌కు చిన్న గాయం అవ్వడంతో కొద్దిరోజులు షూటింగ్‌కు బ్రేక్ పడింది. దానికి తోడు ఇంకా ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ భావిస్తుండటంతో.. మూవీని మే ఎండింగ్ లేదా జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు కొత్త డేట్‌ను లాక్ చేస్తున్నారట.

ఒకవేళ ఏప్రిల్ 30 బరి నుంచి ‘పెద్ది’ తప్పుకుంటే.. అదే రోజు రిలీజ్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా కారా (Kara)కు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ సోలో రిలీజ్ దొరుకుతుంది. లేదు అంటే నిఖిల్ ‘స్వయంభు’ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది.ఇక చరణ్ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు..

రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags