బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం, త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ప్రత్యేకమైన వెర్షన్‌తో రాబోతుందనే వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజా సమాచారం ప్రకారం, “ధురంధర్” సినిమాను ఇప్పుడు “రా అండ్ అన్‌కట్” వెర్షన్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారట. థియేట్రికల్ రిలీజ్ సమయంలో సెన్సార్ కారణాల వల్ల తొలగించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ డైలాగ్స్, అదనపు ఫుటేజ్అన్నీ కలిపి ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఈ కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ సిల్వర్ స్క్రీన్ మీదే ప్రేక్షకులకు భారీ యాక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వగా, ఇప్పుడు OTT లోకి రాబోతున్న అన్ కట్ వెర్షన్ మరింత ఇంటెన్స్ తో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ పాత్రను మరింత రా & పవర్‌ఫుల్‌గా చూపించేందుకు అన్ కట్ వెర్షన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు జోడించనున్నట్లు సమాచారం.
ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో జరగబోతోందట. భారతీయ ప్రేక్షకుల కోసం జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోగా, అంతర్జాతీయ మార్కెట్ కోసం నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, సినిమా ఫ్రాంచైజీ మరియు కొన్ని మ్యూజిక్ హక్కులకు సంబంధించిన లీగల్ చర్చలు కూడా కొనసాగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, ఓటీటీ విడుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, “ధురంధర్” ఇప్పుడు థియేటర్ల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెన్సార్ లేని రా వెర్షన్ కోసం యాక్షన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.