Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) అదే ‘దురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ అయ్యింది. డిసెంబర్లో రిలీజ్ అయిన ‘దురంధర్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Dhurandhar: The Revenge Collections

అందువల్ల మొదటి నుండి ‘దురంధర్ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ప్రీమియర్ షోల నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ టాక్ చెప్పడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోటీగా రిలీజ్ అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దురంధర్ 2’ ఆదిపత్యం వహించింది. ఆ తర్వాత 2 రోజులకి  తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్ళు ఇంకా పెరిగాయి .మొదటి వారం అద్బుతంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో వీకెండ్లో కూడా బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి ‘దురంధర్ 2’ 11  డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 735 cr
ఓవర్సీస్  345 cr
వరల్డ్ టోటల్ 1150 cr (గ్రాస్)

 ‘దురంధర్ : ది రివేంజ్'(దురంధర్ 2) 11 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.1150 కోట్ల(గ్రాస్) ని కలెక్ట్ చేసింది. నార్త్ లో 9 ఏళ్ళుగా ‘బాహుబలి 2’ పేరుతో ఉన్న రికార్డులను సైతం ‘దురంధర్ 2’ బ్రేక్ చేసింది. కేవలం ఇండియాలోనే రూ.735 కోట్ల వరకు వసూల్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.70 కోట్లు(తెలుగు+ హిందీ(వెర్షన్లు కలుపుకుని)) గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. మరో వారం పాటు ‘దురంధర్ 2’ డామినేషన్ ఉండే అవకాశం ఉంది.

పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus