Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది'(Peddi). వాస్తవానికి మార్చి 27నే రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30 కి వాయిదా వేసినట్టు ప్రకటించారు. మరోవైపు ఏప్రిల్ 30కి కూడా ‘పెద్ది’ రాకపోవచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి.

Peddi

చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు వహిస్తారు. అధికారికంగా ప్రకటించే ముందు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. ‘పెద్ది’ మేకర్స్ కూడా అదే ఆలోచనలో ఉండి ఉండొచ్చు.

అయితే ఇప్పుడు సడన్ గా ‘పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ అయ్యింది. దానిని లీక్ చేసింది కూడా ఆ సినిమా యూనిట్ తో సంబంధం లేని నిర్మాత. అతనే ఎస్.కె.ఎన్ కావడం అందరికీ షాకిచ్చే అంశం. ఈరోజు ‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్ వేడుకను ‘అల్లు సినిమాస్’ లో నిర్వహించారు. ఆ సినిమాకి ఎస్ కె ఎన్ నిర్మాత అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈవెంట్ చివర్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాని జూన్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేసినట్టు ఎస్ కె ఎన్ తెలిపారు.

కానీ అదే డేట్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘పెద్ది’ సినిమా రాబోతున్నట్టు తెలిసి.. వేరే డేట్ కోసం పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిజానికి ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ కోసం ఆడియన్స్ ఇప్పుడు డిమాండ్ చేసింది ఏమీ లేదు. కానీ సడన్ గా ఎస్ కె ఎన్ అలా చెప్పడంతో.. వాంటెడ్ గానే ‘పెద్ది’ రిలీజ్ డేట్ ని లీక్ చేసినట్టు అయ్యింది. అందుకే తన ట్విట్టర్ లో క్షమాపణలు తెలుపుతూ ఓ వీడియోని వదిలారు ఎస్.కె.ఎన్.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus