బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్ 2’ అదే ‘దురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ.. రిలీజైన 4 రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
బుధవారం నాడు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే ఇండియాలో రూ.115 కోట్లు రాబట్టడం ఈ సినిమా మాస్ స్టామినాకు నిదర్శనం. అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఏకంగా రూ.180 కోట్ల గ్రాస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది.
దీంతో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (రూ.287 కోట్లు) పేరుతో ఉన్న హిందీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్‌ను ‘దురంధర్ 2’ ఈజీగా దాటేసింది.మరో పక్క టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన ఓపెనింగ్ వీకెండ్ రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేసేసింది. ‘పుష్ప 2′(రూ.605 కోట్లు) ‘బాహుబలి 2’ (రూ.591 కోట్లు) ‘కల్కి 2898 AD’ (రూ.500 కోట్లు) రికార్డులను ఇది అలవోకగా అధిగమించింది. ప్రస్తుతం రూ.762 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాతి స్థానంలో నిలిచింది.
దీంతో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన రెండో ఇండియన్ సినిమాగా దురంధర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది.