Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Advertisement

గతేడాది చివర్లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘దురంధర్’ ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1400 కోట్ల వరకు కొల్లగొట్టింది.

Dhurandhar: The Revenge

తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా.. తెలుగు ఆడియన్స్ హిందీ వెర్షన్ ని తెగ చూశారు. వారి కోరిక మేకర్స్ సెకండ్ పార్ట్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 19 ‘దురంధర్ 2 -ది రివేంజ్'(Dhurandhar: The Revenge) పేరుతో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను వదిలారు.

‘దురంధర్ 2’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 25 సెకన్ల నిడివి కలిగి ఉంది. సినిమా రన్ టైమ్ దాదాపు 4 గంటల నిడివి ఉంటుంది కాబట్టి.. ట్రైలర్ నుండి ప్రిపేర్ చేసేందుకు.. చిత్ర బృందం డిసైడ్ అయ్యింది అని ట్రైలర్ ద్వారా మనం గ్రహించొచ్చు. డకాయిట్ అయినటువంటి రహమాన్ మరణం తర్వాత చోటు చేసుకున్నా భయాందోళన సంఘటనలను చూపిస్తూ.. ట్రైలర్ మొదలైంది.

‘ఎక్కడైతే నొప్పి ఉంటుందో, అక్కడ మగాడు ఉంటాడు’ వంటి డైలోగ్ తో రన్వీర్ సింగ్ పాత్ర ధోరణి ఎలాంటిదో తెలియజేశారు. భారత్ – పాకిస్తాన్ బోర్డర్ వద్ద జరిగే వివాదాలను తెలియజేస్తూ ‘పాకిస్తాన్ భవిష్యత్తును ఇకపై హిందుస్థాన్ నిర్ణయిస్తుంది’ అంటూ వచ్చే డైలాగ్ మంచి హై ఇస్తుంది. ట్రైలర్లో మొత్తం యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీన్లతో నింపేశారు.

హీరో రణ్వీర్ సింగ్ 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించేలా కనిపిస్తున్నాడు. మాధవన్, సంజయ్ దత్..లను కూడా ట్రైలర్లో చూపించారు. మొత్తానికి ‘దురంధర్ 2’ ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలకి తగ్గట్టే ఉంది.హిట్ టాక్ కనుక వస్తే.. రూ.2000 కోట్ల వసూళ్లు సాధించడం ఈజీ అనే చెప్పాలి. ఇక ట్రెయిలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus