Krithi Shetty: కృతిశెట్టి సైడ్ రోల్ లో నటించిన సినిమా ఏదో మీకు తెలుసా?

  • May 9, 2024 / 12:23 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న కృతిశెట్టి (Krithi Shetty) వరుస ఫ్లాపుల వల్ల ప్రస్తుతం కొత్త సినిమా ఆఫర్లను అందుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న మనమే (Manamey) సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా సమ్మర్ కానుకగానే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది. అయితే ఒక సినిమాలో కృతిశెట్టి సైడ్ రోల్ లో నటించగా ఆ సినిమాలో కృతి కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సూపర్ 30 సినిమాలో కృతిశెట్టి స్టూడెంట్ గా సైడ్ రోల్ లో కనిపించగా ఇప్పుడు హీరోయిన్ గా మారి ఆఫర్లు అందుకుంటున్నారు. స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే కృతిశెట్టి రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కృతిశెట్టి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కృతిశెట్టి రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.

కృతిశెట్టి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరింత సత్తా చాటాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర భాషలపై కూడా కృతి ఫోకస్ పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి అంచెలంచెలుగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కృతిశెట్టి రాబోయే రోజుల్లో స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. కృతి చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మరో పదేళ్లు ఆమె కెరీర్ కు ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus