Kovai Sarala: వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

  • May 8, 2024 / 06:57 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ లేడీ కమెడియన్లలో కోవై సరళ (Kovai Sarala) ఒకరు కాగా పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని సరదాగా చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది నాకు ఇష్టం లేదని అందుకే ఇప్పటివరకు పెళ్లికి దూరంగా ఉన్నానని కోవై సరళ కామెంట్లు చేశారు. పెళ్లి చేసుకుంటేనే జీవించాలని ఏమైనా రూల్ ఉందా అని ఆమె వెల్లడించారు.

ఛాన్స్ ఉంటే ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో బన్నీని (Allu Arjun) పెళ్లి చేసుకోవాలని ఉందని కోవై సరళ అన్నారు. కోవై సరళ సరదాగానే ఈ విషయాలు చెప్పినా నెట్టింట మాత్రం ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. కోవై సరళ ప్రస్తుతం విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. రెండేళ్ల క్రితం సెంబీ అనే సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించి ఆమె ఆశ్చర్యపరిచారు.

కోవైసరళ ముఖ్య పాత్రలో నటించిన బాక్ మూవీ థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. కోవై సరళ సరదాగా చేసిన కామెంట్ల గురించి అల్లు అర్జున్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హ్యాట్రిక్ హిట్లతో బన్నీకెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేయగా పుష్ప ది రూల్ ఆ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus